హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ టెక్కీ సూసైడ్

శుక్రవారం, 26 జూన్ 2020 (14:19 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. గత రాత్రి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. తన చావుకు తన భర్తే కారణమంటూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంది. 
 
అంతేకాకుండా, తన భర్త చేతిలో తాను ఏ విధంగా బాధలుపడిందన్న విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో వివరించింది. అలాగే, గతంలో తన భర్తపై పెట్టిన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వివరాలను ఆమె వివరించింది. చివరగా తన తల్లిదండ్రులను క్షమాపణలు కోరింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లావణ్య భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు