పనికిమాలిన - పసలేని బడ్జెట్ : సీఎం కేసీఆర్

మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:36 IST)
కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 సంవత్సక వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పదించారు. ఒక పనికిమాలిన, పసలేని బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు లోనుచేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, రైతులు, పేదలు, సామాన్యులు, కుల వృత్తులవారు, ఉద్యోగులు ఇలా అన్ని రంగాల వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది అని చెప్పారు. 
 
ముఖ్యంగా, ఎలాంటి దిశానిర్దేశం లేకుండా బడ్జెట్‌ను రూపకల్పన చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ చాలా బాగా ఉందంటూ కేంద్రం గొప్పలు చెప్పుకుంటుందని, నిజానికి మసిపూసి మారేడు కాయ చేసిన గోల్‌మాల్ బడ్జెట్ అంటూ కేసీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్ వల్ల రైతంగానికి రవ్వంత ఉపయోగం కూడా లేదన్నారు. 
 
పన్ను చెల్లింపుల విషయంలో శ్లాబులను మార్చకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు లోనుచేసిందన్నారు. కోట్లాది మంది ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందన్నారు. ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధికి కేంద్రం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు