ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించింది ప్రభుత్వం. క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అందరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకంగా మారింది.