తెరాస గెలుపు తాత్కాలికమేనని, తమ లక్ష్యం 2023 అని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భాజపా అండగా ఉంటుందన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా భాజపా గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు వాణీదేవీ, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు గెలుపొందగా, వీరికి తెలంగాణ రాష్ట్ర సీఎం, తెరాస అధినేత కేసీఆరు శుభాకాంక్షలు తెలిపారు.