పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని సీఎం, మంత్రులు నిర్ణయించారు.
ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాలను సంబంధిత మంత్రులే చూసుకుంటారని చెప్పారు. అలాగే, ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం తెలిపారు.