భార్య ఉరేసుకుని ఆత్మహత్య.. రెండు గంటల్లోనే భర్త సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సూసైడ్

గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:14 IST)
తెలంగాణలోని జనగాం పట్టణంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెండు గంటల తర్వాత సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ (55) తన భార్య స్వరూప (50) ఆత్మహత్య చేసుకోవడంతో ఓదార్చేందుకు కొందరు పోలీసు అధికారులు అక్కడికి రావడంతో తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
గురువారం తెల్లవారుజామున స్వరూప బాత్‌రూమ్‌లో కండువాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్‌కి మెలకువ వచ్చి బాత్‌రూమ్‌కి వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి చేరుకున్నారు. 
 
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవేందర్ రెడ్డి, పట్టణ ఇంచార్జి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు, ఇతర అధికారులు కూడా ఎస్‌ఐ ఇంటికి చేరుకున్నారు. 
 
ఇంతలో బెడ్ రూంలో వారితో పాటు కూర్చున్న శ్రీనివాస్ వాష్ రూంలోకి వెళ్లాడు. నిమిషాల తర్వాత తుపాకీ శబ్ధం వినిపించింది అధికారులకు. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా ఎస్‌ఐ శవమై కనిపించాడు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు