భూ రిజిస్ట్రేషన్లలో ధరణి పోర్టల్ దూసుకుపోతున్నది. రోజుకు సగటున 3 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ధరణి లావాదేవీలు ప్రారంభమైన నవంబర్ నెలతో పోల్చితే ఫిబ్రవరిలో రెట్టింపునకు చేరాయి. పోర్టల్ ఆధారంగా సేవలు అత్యంత సులభంగా, పారదర్శకంగా, వేగంగా జరుగుతుండటంతోపాటు ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నాయి.
ధరణి ప్రారంభమైన మొదటి నెల లో 36,710 రిజిస్ట్రేషన్లు కాగా, 36,920 స్లాట్లు బుక్ అయ్యా యి. ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్లు 71,402కాగా, స్లాట్లు 75,327 బుక్ అయ్యాయి. మంగళ, శనివారాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో 3 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 3.38 లక్షల లావాదేవీలు జరుగగా. రూ.374 కోట్ల ఆదా యం సమకూరిందని అధికారులు తెలిపారు.
ప్రధాన సమస్యలకు మోక్షం
తాజాగా ప్రవేశపెట్టిన గ్రీవెన్స్ మాడ్యూ ల్', ఇతర గ్రీవెన్స్ ఆప్షన్లతో 60 నుంచి 70 భూ సమస్యలకు చెక్ పడుతున్నదని అధికారులు చెప్తున్నారు. గ్రీవెన్స్ మాడ్యూల్‌తో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు, సర్వే నంబర్ మిస్సింగ్, విస్తీర్ణం నమోదులో పొరపాట్లు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. దీంతోపాటు దరఖాస్తు స్థితి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?, ఒకవేళ ఆమోదిస్తే భూ యజమాని ఎవరిని సంప్రదించాలి? వంటి వివరాలన్నీ దరఖాస్తుదారు మొబైల్ నంబర్‌కు అప్‌డేట్లురానున్నాయి.