విద్యార్థులు ఇకపై భారీ బరువు గల బరువును మోయక్కర్లేదు. విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సబ్జెక్టులకు క్లాస్ వర్కుకు ఒకే బుక్ ఇవ్వాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. హోం వర్కు స్కూల్లోనే పూర్తి చేయించాలని విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య తెలిపారు. ఈ మేరకు జీవో 22ను జారీ చేశారు.
ఒకట్రెండు తరగతులకు ఒకటిన్నర కిలోలు, 3, 4, 5 తరగతులకు 3కిలోల లోపే వుండాలని ఆచార్య చెప్పుకొచ్చారు. రోజూ అన్ని పుస్తకాలూ బడికి అక్కర్లేదని.. పేర్కొన్నారు. స్కూలు బ్యాగులు మోత బరువు కారణంగా మెట్లు ఎక్కుతున్న విద్యార్థులు వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.