మహిళలు బంగారం, దుస్తులతోపాటు పూలను బాగా ఇష్టపడతారని, శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అభివర్ణించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో- బంగారు బతుకమ్మ ఉయ్యాలో - కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో- అని రాగతాళ యుక్తంగా తెలుగులో చక్కగా ఆమె ఆలపించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయిత్రులు శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, శ్రీమతి ఆవుల మంజులత, శ్రీమతి దీపికారెడ్డి, ఆమె శిష్య బృందం, తదితర మహిళలు 200 మందికి పైగా పాల్గొన్నారు.
ముఖ్యంగా, అక్టోబరు 1న మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్థులు పాల్గొంటున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 5న రాజభవన్ మహిళా ఉద్యోగినులు, రాజభవన్ పరివారం పాల్గొంటారని ఆయన అన్నారు.