డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలు పెంపు..

శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (22:11 IST)
తెలంగాణ సర్కారు ప్రజలకు షాక్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం అన్నిరకాల బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని  తెలిపింది. 
 
డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించారు. 
 
పల్లెవెలుగు, సీటీ ఆర్డినరీ సర్వీసులకు రూ.2 పెంచారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీకి రూ.5 పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు