ఆ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా అకస్మాత్తుగా లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నాయిని, అలీలు సుమారు మూడు నిమిషాల పాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వెంటనే ఆసుపత్రి వారు, భద్రతా సిబ్బంది లిఫ్టు సమస్యను గుర్తించడంతో వాళ్లిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.