తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదలచేయనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ పరీక్షా ఫలితాల కోసం పరీక్ష రాసిన దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రథమ సంవత్సరానికి 4.64 లక్షల మంది, ద్వితీయ సంవత్సరానికి 4.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుండి ఏప్రిల్ 24 మధ్య నిర్వహించారు. 33 సంవత్సరాల పరీక్షల తర్వాత ఫలితాలు విడుదల అవుతున్నాయి. విద్యార్థులు www.tsbie.cgg.gov.in www.results.cgg.gov.in www.examresults.ts.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చు.