ఇదే అంశంపై మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ, యాసంగిలో వేసే వరి పంటను కొనుగోలు చేసే ప్రసక్తే ఉండదని, అందువల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవన్నారు. ఒకవేళ ప్రభుత్వ హెచ్చరికలను కాదని రైతులు వరి పంట వేస్తే చిక్కుల్లో పడతారని చెప్పారు. అదేసమయంలో రైతులు ప్రత్యామ్నాయ సాగుపై ఆలోచనలు చేయాలని ఆయన కోరారు.