సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు(పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ కేర్) 751, ట్యూటర్ పోస్టులు 357, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (వైద్య విధాన్) 211, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ప్రివెంటివ్ మెడిసిన్) 7 పోస్టులు ఉన్నాయి.
సీనియారిటీని బట్టి సీఏఎస్ పోస్టులకు నెలవారీ వేతన స్కేలు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు, ట్యూటర్ల పోస్టులకు 2016 యూజీసీ స్కేల్ ఆధారంగా రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు కింద రూ.200, ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.120 చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష ఫీజుకు ఎలాంటి మినహాయింపు లేనప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, మాజీ సైనిక ఉద్యోగుల నిరుద్యోగ దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు మినహాయింపు ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించడానికి ఎటువంటి మినహాయింపు లేదు.