ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా ఇంటర్‌బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్‌సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది. ఇక, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని.. ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ లు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో.. అనుమతికి మించి విద్యార్థులను కూడా చేర్చుకోవదని ఆదేశించింది.. విద్యార్థుల అడ్మిషన్స్‌కు ఆధార్ కార్డ్ తప్పనిసరి అని పేర్కొంది. మరోవైపు.. కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తి కాకముందే అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల చేసింది ఇంటర్ బోర్డ్.. నిన్నటితో కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువు ముగిసిపోగా.. ఆ దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది.. ఈలోగానే ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఇక, అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లో మాత్రమే చేరాలని చెబుతున్నారు ఇంటర్‌బోర్డు అధికారులు.