తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 12న టెట్ పరీక్షలు

గురువారం, 24 మార్చి 2022 (19:56 IST)
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే  ఈ టెట్ కోసం ఈ నెల 26 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.  జూన్‌ 12న టెట్‌ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. 
 
అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 
ఇకపోతే.. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు టెట్ అర్హతల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
 
ఇంకా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు టెట్ పేపర్ 1కు బీఈడీ చేసిన వారు కూడా అర్హులేనని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీవో సైతం విడుదల చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు