ఇష్టపడే పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరూ అన్యోన్యంగా కలిసి ఉన్నారు. కానీ ఆమెకు మాత్రం కొన్నిరోజులకు ప్రియుడు గుర్తుకు వచ్చాడు. భర్తను దూరంగా ఉంచింది. భార్యను మందలించి మళ్ళీ ఆమెకు దగ్గరవ్వాలని చూశాడు భర్త. ఆమెలో మార్పు రాకపోగా భర్తనే సూటిపోటి మాటలతో చిత్ర హింసలు పెట్టింది. చివరకు కుటుంబం మొత్తం సర్వనాశనమైంది.
ఇంతలో ఆమె వాంతులు చేసుకుంది. భర్త షాకయ్యాడు. ఏం జరిగిందని ప్రశ్నించాడు. అసలు విషయం చెప్పింది. నేను గర్భవతిని, కానీ నా కడుపులో ఉన్న బిడ్డకు కారణం నువ్వు కాదు నా ప్రియుడు రాజేందర్. అతనే నా ప్రాణం.. నా సర్వస్వం. ఇక నువ్వు బతికి ఉన్నా వేస్ట్.. చచ్చిపో అంటూ భర్తను రెచ్చగొట్టింది.