తెలంగాణాలో మరో 1982 పాజిటివ్ కరోనా కేసులు

ఆదివారం, 9 ఆగస్టు 2020 (09:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్రంలో కొత్తగా 1982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 1669 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే, రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరింది. ఆసుపత్రుల్లో 22,869 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 55,999 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 627కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 139 కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు