మెదక్ లోక్‌సభ బైపోల్ : 3,64,229 ఓట్ల మెజార్టీతో "కొత్త" గెలుపు

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (14:07 IST)
మెదక్ లోక్‌సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈయన మొత్తం 3,64,229 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, గత ఎన్నికల్లో కేసీఆర్ సాధించిన మెజార్టీ కంటే 30 వేలు తక్కువ కావడం గమనార్హం. 
 
ఈ గెలుపై ఆయన స్పందిస్తూ.. తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారని, కేసీఆర్ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచి తనకు ఓటు వేశారని తెలిపారు. మెదక్ అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
 
మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఊహించిందేనని ఆపార్టీ లోక్ సభ అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఓటింగ్ శాతం తగ్గినా టీఆర్ఎస్కు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి