ఇప్పటికే రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో తాజాగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయనను కొత్తగూడెం పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వనమా రాఘవపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాఘవ బెయిల్‌కు అప్లై చేసినా అడ్డుకునేందుకు రాకుండా కౌంటర్ దాఖలు చేస్తామంటున్నారు పాల్వంచ ఎఎస్పీ. మరోవైపు రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కాసేపటి క్రితమే ఆయన బహిరంగ లేఖ రాశారు.