తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ లాస్ట్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు.
ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న తిరిగి స్కూళ్లు రీ-ఓపెన్ అవుతాయి.
అకాడమిక్ ఇయర్ క్యాలెండర్‌కు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.