తెలంగాణాలో లాక్డౌన్ సడలింపులు... సాయంత్రం 6 గంటల వరకు బస్సులు

గురువారం, 10 జూన్ 2021 (10:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ సండలింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  బస్సులను నడుపుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులకు అనుగుణంగా బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటల వరకు వీటిని నడపనున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఆపరేషన్స్‌) యాదగిరి చెప్పారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,600 బస్సులు తిప్పుతున్నట్టు చెప్పారు. ఇవికాకుండా మరో 800 వరకు సిటీ బస్సులను నడపనున్నామన్నారు. మే 12 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. దీనిని మరో 10 రోజులు పొడిగించింది. సడలింపు వేళలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రకటించగా.. ఇళ్లకు చేరే సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది. 
 
ఈ వెసులుబాటు సమయాలకు అనుగుణంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులను ఆర్టీసీ తిప్పనుంది. ఆర్టీసీలో అద్దె బస్సులు సహా ఉన్న 9000కు పైగా బస్సుల్లో.. ఇప్పుడు 3,600 బస్సులు తిరుగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు