హైదరాబాద్ దోమలగూడకు చెందిన 41 యేళ్ళ వైద్యుడుతో పాటు ఆయన భార్య(36)కూ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈమె కూడా వైద్యురాలే కావడం గమనార్హం. అలాగే, కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈన ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలావుంటే, దేశరాజధాని ఢిల్లీలో బస్తీ దవాఖాన నడిపే ఓ డాక్టరుకు కరోనా సోకడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆయన భార్యకు, టీనేజీ కూతురికి పరీక్షలు జరిపితే వారికీ పాజిటివ్ వచ్చింది. మరో వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్టు తేలింది.
దాంతో ఆయన క్లినిక్‌ను సందర్శించిన సుమారు 900 మందిని క్వారంటైన్ చేశారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ ఈ సంగతి వెల్లడించారు. 14 రోజుల పాటు అనుమానితులకు క్వారంటైన్ కొనసాగుతుంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ మార్చి 12న ఆ బస్తీ దవాఖానాను సందర్శించడమే ఈ కరోనా గొలుసుకట్టు వ్యాప్తికి కారణమని తెలిసింది.