తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దాచేపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రజనీ అనే ఉపాధ్యాయురాలు సమయపాలన పాటించడం లేదు. పాఠశాలకు కరెక్ట్ సమయానికి రావడం లేదని వాడపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పులగం రాధిక గుర్తించి, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణ ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు రాధిక దంపతులు ఈ నెల 19న వాహనంపై వస్తుండగా మిర్యాలగూడకు చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్ద వారిపై దాడి చేశారు.
ఆ తర్వాత వారి వద్దనున్న ఐదు సవర్ల బంగారం తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డి, రజనిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నిన్న నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు.