నన్ను చంపేస్తానని గతంలో డిఎంకే పార్టీ నేతలే బెదిరించారు. కానీ నేను మాత్రం భయపడలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం నాకు లేదు. టిఆర్ఎస్‌లోకి నా పార్టీని విలీనం చేయమంటే చేశాను. కానీ కొన్నిరోజులకు నన్ను టిఆర్‌ఎస్ నేతలు బయటకు పంపారు. నన్ను ఎందుకు బయటకు పంపించారో నాకు తెలియదు. ఇప్పటికీ అదే నాకు అర్థం కావడం లేదు.
కానీ రాహుల్ గాంధీ నాకు సపోర్టుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణా రాష్ట్రంలో ఎగురవేస్తా.. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వచ్చి తీరుతుంది. ఎంతోమంది నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వస్తున్నారు. ఒకవేళ నాకు చావంటూ వస్తే అది తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తరువాతేనని ఆవేశంగా ప్రసంగించింది విజయశాంతి.