హైదరాబాద్ నగర వాసులు రెండు రోజులపాటు నీటి కష్టాలు రానున్నాయి. ఇదే అంశంపై భాగ్యనగరి జలమండలి నగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్ వాటర్ సప్లై స్కీం(ఎండబ్యూఎస్‌ఎస్) ఫేజ్-2లో కలాబ్‌గుర్ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్‌సీ పంపింగ్ మెయిన్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది.
ఈ కారణంగా మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ఏరియాలను పరిశీలిస్తే,
డివిజన్ నెం.9 హైదర్‌నగర్, రాం నరేష్ నగర్, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్, వసంత్‌నగర్, ఎస్‌పీ నగర్.
డివిజన్ నెం.15 మియాపూర్, దీప్తినగర్, శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు.
డివిజన్ నెం. 23 నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్.
డివిజన్ నెం.32 బొల్లారం ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, హైదరాబాద్ జలమండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.