పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ పంపిణీ చేశారు. పురపాలికలు, నగరపాలికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయని... నామినేటెడ్ పోస్టులు ఎన్నో భర్తీ చేయాల్సి ఉందన్న విషయం వివరించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసంతృప్తులు, అసమ్మతుల మాట వినిపించకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులదేనని స్పష్టం చేశారు.