డ్రోన్ల సాయంతో మందులు ఎగురుకుంటూ వస్తాయ్..!

శనివారం, 20 జులై 2019 (19:49 IST)
ఇకపై మందులు డ్రోన్ల సాయంతో ఎగురుకుంటూ వస్తాయి. ఆరోగ్య సంరక్షణలో డ్రోన్ల అమలుకు రంగం సిద్ధమవుతుంది. రోగులకు అత్యవసర సేవల కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చునని తెలంగాణ సర్కారు ఈ పద్ధతిని అమలులోకి తెస్తోంది. 
 
ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నెట్‌వర్క్ కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ (WEF) తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై అనే వినూత్న డ్రోన్-డెలివరీ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం, హెల్త్ నెట్ గ్లోబల్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టులో రక్తం, టీకాలు, వైద్య నమూనాలు, అవయవాల శీఘ్రంగా డెలివరీ అవుతాయి. ఇందుకోసం సమగ్ర అధ్యయనం జరుగనుంది. 
 
తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు హెల్త్ నెట్ గ్లోబల్ ఈ ప్రాజెక్టుకు కావలసిన సాంకేతికత, పరిశోధనలలో సహాయబడే వారికీ నాయకత్వం వహించే ఒప్పందంపై సంతకం చేశారు. 
 
వైద్య సేవలను మెరుగ్గా అందించేందుకు డెలివరీ కోసం డ్రోన్‌లను ఎలా ఉపయోగించవచ్చునో పరిశీలించనున్నారు. తర్వాత తెలంగాణలో పైలట్ అమలు జరుగుతుంది. డ్రోన్లను ఉపయోగించి వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి చారిత్రాత్మక ప్రయత్నం చేస్తున్నట్లు హెల్త్ నెట్ గ్లోబల్ లిమిటెడ్ అధ్యక్షులు కె. హరిప్రసాద్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు