విచారణకు రాబోతున్న కేసుల విషయం లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ 35 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి మా ట్లాడేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా అని మండిపడ్డారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఉద్యమ సమయంలో పోరాట యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్క తోకలుగా కనిపిస్తున్నారా అని నిలదీశారు. 50వేల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి తెస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఏ ఉద్యోగాలనూ కేసీఆర్ తీయలేడని, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.