జగన్ దూకుడు.. "బఫూన్" కామెంట్స్‌ ...ఏపీ అసెంబ్లీలో రభస

శనివారం, 23 ఆగస్టు 2014 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో తెలుగుదేశం శాసనసభ్యులను ఉద్దేశించి చేసిన బఫూన్ వ్యాఖ్యలు శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, గందరగోళం నెలకొనేందుకు దారితీశాయి. బఫూన్ కామెంట్స్‌పై ఇరు పార్టీల నేతలు మరింత పట్టుదలగా ఉండటంతో ఈ వివాదం మరింతగా పెరుగుతుందేగానీ, ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. 
 
తాను చేసిన వ్యాఖ్యలపై జగన్ మీడియా సమావేశం పెట్టీ మరీ సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నా.. జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ప్రకటించారు. 
 
దీంతో శనివారం నాడు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ‘బఫూన్’ వ్యాఖ్యల మీద వివాదం కొనసాగింది. తెలుగుదేశం సభ్యులు జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే జగన్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఈ విషయంలో క్షమాపణ చెప్పే ధోరణిని కనబరచలేదు. సభలో గందరగోళం జగడంతో 10 గంటల 15 నిమిషాలకు స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. 

వెబ్దునియా పై చదవండి