కాగా, తెలంగాణలో వెంటనే 1.91లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షకు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆది నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు షర్మిల.
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు వేస్తున్నారు. కోవిడ్ టైంలో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తిచూపిస్తున్నారు. తెలంగాణలో వెంటనే 1.9 1లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఉద్యోగ దీక్షకు దిగిన షర్మిల.. తన అనుచరులు కోవిడ్ బారిన పడటంతో ప్రజాసమస్యలపై పోరుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు.
అయితే తెలంగాణ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సందించేందుకు తాను ట్విట్టర్‌ను వేదికగా ఎంచుకున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. ''రోజురోజుకు తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దొర కేసీఆర్‌కు పట్టింపు లేదు. సిబ్బంది కొరతతో వైద్యారోగ్యశాఖ ఇబ్బంది పడుతుంటే సారుకు కనపడటం లేదు'' అంటూ తెలంగాణ యాసలో ట్వీట్ చేశారు.