అంచనాలు పెంచేసిన బాలయ్య 'లెజండ్' టీజర్!

గురువారం, 6 మార్చి 2014 (11:54 IST)
FILE
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే యాక్షన్, ఎమోషన్ గుర్తొస్తాయి. 'సింహా' తర్వాత వీరిద్దరూ కలసి చేస్తున్న 'లెజండ్' సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా ఆడియోను ఈ నెల 7న హైదరాబాదులోని శిల్ప కళా వేదిక ఆడిటోరియంలో అభిమానుల సందడి మధ్య విడుదల చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

'Lion is Back' అన్న క్యాప్షన్‌తో విడుదలైన 'లెజండ్' సినిమా లేటెస్ట్ లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. అలాగే, తాజాగా విడుదల చేసిన టీజర్ అయితే బాలయ్య అభిమానులను ఆనంద డోలికల్లో ఊగించింది. 'సింహా' రేంజిలో ఈ సినిమా కూడా అలరిస్తుందన్న నమ్మకం వారిలో ఏర్పడిపోయింది.

ఈ టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. గతంలో బాలకృష్ణ సినిమాల విషయంలో ఎన్నడూ లేని విధంగా హిట్స్ పొందుతోంది. దీంతో దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీగా వున్నారు. తమ సినిమా విజయానికి ఇది నాంది పలుకుతోందని సంబరపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి