'అత్తారింటికి దారేది' ఆడియో ఫంక్షన్ స్టార్ట్... సింహానికి నాకు అదే తేడా... హైలెట్స్

శుక్రవారం, 19 జులై 2013 (19:41 IST)
WD
అత్తారింటికి దారేది మూవీ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఈ ఫంక్షన్లో నటుడు అలీ మాట్లాడుతూ... అత్తారింటికి దారేదిలో అత్తగా నటించిన అత్తయ్య చెన్నైలో కుర్రకారును ఒకప్పుడు తన నటనతో కుమ్మేసింది. ఆ అత్త మరికొద్దిసేపట్లో రాబోతోంది. ఇక పవన్ కల్యాణ్ గురించి చెప్పాలంటే... ఒక్క డైలాగ్ చెప్తా, ఒరేయ్ సిద్దప్పా... సింహం నేను ఒకటే. కాకపోతే సింహం గడ్డం గీసుకోదు... నేను గీసుకుంటా... అని చెప్పి ఇలాంటి బోలెడు డైలాగులు ఎన్నో ఉన్నాయి.

ఇక సమంత అందాలు అదుర్స్. ఆమె అందాల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్... అంటూ సైగతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఫంక్షన్ జరుగుతూ ఉంది. శిల్పాకళా వేదికలో జరుగుతున్న ఈ ఫంక్షనుకు మెగా ఫ్యామిలీ మెంబర్లు వస్తారా... రారా అన్నది చూడాలి.

వెబ్దునియా పై చదవండి