అవును నేను దొంగనే అంటున్న బ్రహ్మానందం

శనివారం, 9 నవంబరు 2013 (13:32 IST)
FILE
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఓ హిందీ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడీ వార్తను బ్రహ్మానందం ధ్రువీకరించారు. అనీజ్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందే 'వెల్కం బ్యాక్' సినిమాలో నటించడానికి ఆయన సంతకం చేశారు.

దీని గురించి బ్రహ్మానందం చెబుతూ, "అవును ... వెల్కం బ్యాక్ సినిమాలో నటిస్తున్నాను. అందులో ఒక దొంగ పాత్ర పోషిస్తున్నాను. దర్శకుడు అనీజ్ నా అభిమానట. తెలుగు నుంచి హిందీలోకి డబ్ అయిన పలు సినిమాల్లో నా నటన చూసి ఆ పాత్రను నా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశానని చెప్పారు. దాంతో 'నో' చెప్పలేకపోయాను" అంటున్నాడు బ్రహ్మీ.

వెబ్దునియా పై చదవండి