అశ్లీల నృత్యం కేసులో మల్లికా శెరావత్‌కు ఊరట!

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (14:06 IST)
అశ్లీల నృత్యం చేశారని ఆరోపిస్తూ బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ పై గుజరాత్ స్థానిక న్యాయస్థానంలో ధాఖలైన కేసుపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే విధించింది. ముంబయిలోని ఐదు నక్షత్రాల హోటళ్లో 2006 డిసెంబరు 31వ తేదీ రాత్రి ఆమె నృత్యం చేశారు. ఇది పలు ఛానెళ్లలో ప్రసారమైంది.

ఈ నృత్యం అసభ్యంగా, అశ్లీలంగా ఉందని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ బరోడా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నరేంద్ర తివారీ 2007లో గుజరాత్ స్థానిక న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. దీనిపై ఆ న్యాయస్థానం జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని మల్లికా శెరావత్ గుజరాత్ హైకోర్టుకు విన్నవించింది.

దీన్ని తిరస్కరించిన హైకోర్టు ఆమెకు బెయిలు అర్హత కలిగిన వారెంటు జారీ చేసింది. ఈ నెల 19న ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మల్లికా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ చౌహాన్ తో కూడిన ధర్మాసనం గుజరాత్‌లో ఆమెపై దాఖలైన కేసులో స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి