ఎస్.వి.ఆర్. మీడియా నేనే అంబానీ రిలీజ్‌కు రెడీ

File
FILE
ఆర్య, నయనతార జంటగా రాజేష్ దర్శకత్వంలో ఎస్.వి.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తున్న 'నేనే అంబానీ' డబ్బింగ్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన 'నేనే అంబానీ' ఆడియో సూపర్ హిట్ అయిందన్నారు. ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం మీద అంచనాలు మరింత పెరిగాయన్నారు. వ్యాపారపరంగా ఈ చిత్రానికి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయన్నారు.

మొదటి కాపీ సిద్ధమైందన్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని నిర్ణయిస్తామన్నారు. మా ఎస్.వి.ఆర్ మీడియా అందించిన 'దశావతారం', 'ఆవారా' చిత్రాల్లా 'నేనే అంబానీ' కూడా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

కాగా, ఈ చిత్రం ఆర్య, నయనతార, సంతానం, విజయలక్ష్మి, లక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు.. శశాంక్ వెన్నెల కంటి, సంగీతం.. యువన్ శంకర్ రాజా, కెమెరా.. శక్తి శరవణన్, ఆర్ట్.. జాక్‌సన్, ఎడిటింగ్.. వివేక్, నిర్మాత.. కేఎస్.శ్రీనివాసన్, దర్శకత్వం.. రాజేష్ ఎం.

వెబ్దునియా పై చదవండి