"కాలేజ్ డేస్" ఆడియో ఆవిష్కరణ

WD
ఆర్య, సోనీ అగర్వాల్ (7జి బృందావన కాలనీ ఫేమ్) జంటగా తమిళంలో వచ్చిన ఓ చిత్రాన్ని "కాలేజ్ డేస్" పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. దీనికి "గోల్డెన్ డేస్" అనే ఉప శీర్షికను కూడా జతచేశారు. అనీష్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్. వేణుగోపాల రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నంద దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఆడియో మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా బుధవారం విడుదలైంది.

వార్త ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గౌరవ్ సంఘీ తొలి సీడీని విడుదల చేసి నటుడు సుత్తివేలుకు అందించారు. పాటలు బాగున్నాయని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తే నిర్మాత తెలుగులో సినిమాను డైరక్ట్ చేసే అవకాశం ఉంటుందని సుత్తివేలు అన్నారు.

నిర్మాత వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ... లో బడ్జెట్‌లో సినిమా తీయాలనుకున్నామని, ఈ క్రమంలో డబ్బింగ్ సినిమాగా ముందుకొస్తే మంచిదని చాలా సినిమాలు చూశామని, ఇది బాగా నచ్చి అనువదిస్తున్నామని చెప్పారు. నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నామని, "యు" సర్టిఫికేట్‌తో తొలికాపీ సిద్ధమైందని చెప్పుకొచ్చారు.

కాలేజ్ డేస్ మళ్లీ రావనుకుంటారనీ, కానీ ఈ సినిమాలోమళ్ళీ వస్తాయని చూపించడం జరిగిందని మరో నిర్మాత చల్లా శ్రీనివాసరెడ్డి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి