కిరణ్ రాథోడ్ "హైస్కూల్" వాల్‌పోస్టర్లపై పేడ

పాఠశాలలో చదువుకునే విద్యార్థి, ప్రౌఢ సుందరితో ప్రేమాయణం నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం హైస్కూల్. ఈ చిత్రంలో ప్రౌఢ సుందరిగా కిరణ్ రాథోడ్ నటించింది. ఈ సినిమాలో బాలునితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. 

ఇటువంటి సినిమాలు సమాజాన్ని పక్కదోవ పట్టిస్తాయని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు హైస్కూల్ సినిమాను విడుదల చేయకుండా చూడాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళకు దిగారు.

కొంతమంది ఆందోళనకారులు హైస్కూల్ చిత్రానికి సంబంధించిన వాల్ పోస్టర్లపై పశువుల పేడని విసిరి తమ నిరసనను తెలిపారు. ఇదిలావుండగా హైస్కూలు చిత్రం విడుదల నిలిపి వేయాలంటూ హైకోర్టు స్టే విధించింది.

వెబ్దునియా పై చదవండి