కృష్ణుడి "చేత వెన్నముద్ద" రీ-రికార్డింగ్ పూర్తి!

WD
ఆల్తాఫ్, క్రితిక కృష్ణన్ జంటగా రోహిత్.ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న "చేత వెన్నముద్ద" చిత్రం రీరికార్డింగ్ పూర్తయింది.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత భరత్ కుమార్ మాట్లాడుతూ.. పాటలన్నీ చక్కటి సాహిత్యంతో అందరినీ ఆకట్టుకుంటాయి. సున్నితమైన కథాంశంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలుంటాయి. భిన్న భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తప్పకుండా అందరూ మెచ్చే చిత్రమిదవుతుంది. పాటలను వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయనున్నాం. ఇమంది రామారావు రాసిన చిగురాకు కదిలినా పాట హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. తెలుగు తెరపై తొలిసారి మెర్సీ కిల్లింగ్ (కారుణ హత్య)పై వస్తున్న చిత్రం ఇది. సంగీతభరిత చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కృష్ణుడు, అన్నా జెన్, మెటిల్డా, మైక్‌ తదితరులు నటించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఏప్రిల్ చివరి కల్లా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: మోహన్ తుమ్మల, పాటలు : రవిస్వరూపన్, ఇమంది రామారావు, కెమెరా : రవి.కె.నీర్ల, ఎడిటింగ్: వి.ఎన్. రెడ్డి, సంగీతం: రవి స్వరూపన్-లావణ్య, కథ: వి.ఎన్. సతీష్, సహ నిర్మాత: జానకిరామ్ పామరాజు, దర్శకత్వం: రోహిత్. ఎస్. అభ్యుదయ్.

వెబ్దునియా పై చదవండి