"చిరు"పై చిన్న నిర్మాతల దెప్పిపొడుపు!

బుధవారం, 10 సెప్టెంబరు 2008 (18:52 IST)
WD
సినిమా టిక్కెట్ల ధర పెంపును ప్రభుత్వం రద్దు చేయడంపై చిన్న నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తూ, మెగాస్టార్ చిరంజీవిని దెప్పిపొడిచారు. తమకున్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొందరు అగ్రహీరోలు వేసిన ఎత్తుకు ఆనాడు ప్రభుత్వం తలొగ్గిందని, ఈనాడు అది తప్పని తెలుసుకుని రద్దు చేసిందని తెలిపారు.

చిరంజీవి రాజకీయాల్లో రావడం వల్ల సీఎం టిక్కెట్ల ధర పెంపును రద్దు చేయలేదని, యాదృశ్చికంగా జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయమై బుధవారం చిన్న నిర్మాతల సంఘం తరపున ప్రతాని రామకృష్ణ గౌడ్, సాగర్, విజయ్ చందర్, జి. శ్రీనివాస రెడ్డి, మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.

ఇందులో భాగంగా, రెండు వారాలకు టిక్కెట్లు రేట్లు పెంపుదలను రద్దు చేసిన రోజే చిన్న నిర్మాతలకు పన్నును మినహాయిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి చెబితే, ఐఏఎస్ అధికారులు ఇది పద్ధతి కాదని అడ్డుకున్నారని, చిన్న నిర్మాతల కమిటీ సభ్యులు వెల్లడించారు. సీఎం చిత్ర పరిశ్రమకు మేలు చేయాలనుకున్నారని, కానీ కొంతమంది అడ్డుతగిలారని చిన్న నిర్మాతలు మీడియా సమక్షంలో వాపోయారు.

ఈ నెల 12,13 తేదీల్లో సీఎంను కలిసి థియేటర్ రెంటర్ విధానాన్ని సవరించాలని, చిత్ర చిత్రాలకు టాక్స్ ఫ్రీ చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానాలు అమలైతే భవిష్యత్‌లో అన్ని సినిమాలకు తెలుగు టైటిల్స్ పెడతారని నిర్మాతలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి