చెన్నై వర్సెస్ హైదరాబాద్ సినీ కార్మికులు

ఆంధ్ర, తెలంగాణా అంటూ హైదరాబాద్‌లో జరుగుతున్న రాజకీయవేడి ప్రజల్లో నాటుకొని పోయినట్లే.... సినిమారంగంలో ఆ వేడికన్నా.... చెన్నై వర్సెస్‌ హైదరాబాద్‌ కార్మికుల తేడా నెలకొని ఉంది. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య సమాఖ్య కంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సినీ కార్మికుల సమస్యలు వేరువేరుగా ఉన్నాయి.

కానీ, ఈ ఏడాదిలో 'కందిరీగ' షూటింగ్‌లో చెన్నై ఫైటర్లకు, ఆంధ్ర ఫైటర్లకు సంబంధించిన గొడవలు జరిగాయి. ఆ గొడవతో షూటింగ్‌లు ఆపేస్తామని నిర్మాతలు ట్విస్ట్‌ ఇచ్చి కార్మికులకు గండి కొట్టారు. దీంతో కార్మికుల స్తబ్దుగా ఉన్నవారు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి... మూడేళ్లకు రెన్యువల్‌ చేయాల్సిన జీతభత్యాలు అమలుకావడంలేదని గగ్గోలుపెట్టారు.

దీంతో అప్పటి ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ అధ్యక్షుడు సురేస్‌బాబు వేతనాల్లో 30శాతం పెంచుతామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. 50 శాతం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. అయితే... తెలుగు సినీ కార్మికసమాఖ్య మాత్రం అటూ ఇటుగా ఉంది. 24 శాఖల్లోని కొంతమంది నాయకులు నిర్మాతలకు తొత్తులుగా మారారని కార్మికులు దుయ్యబట్టారు.

దక్షిణాదికి పాకింది

కార్మికుల జీతభత్యాల పెంచాలని.. అటు కర్ణాటక, తమిళనాడు, మలయాళం, ఆంధ్రప్రదేశలకు పాకింది. ఇప్పటికే కర్ణాటకలో 30శాతం పెంచేందుకు సౌత్‌ ఛాంబర్‌ అంగీకరించింది. అక్కడి కార్మికులుకూడా ఓకేఅన్నారు. కానీ ఆంధ్రలో 50 నుంచి 80శాతంపెంచాలని పట్టుపడుతున్నారు.

అయితే ఇక్కడ మాత్రం చెన్నై, ఆంధ్రవారుకూడా ఒకే మాట ఉండడం విశేషం. తమకూ ఎక్కువజీతాలు పెంచాలని తమిళనాడు అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. ఇందుకు సౌత్‌ఛాంబర్‌ అధ్యక్షుడు సి.కళ్యాణ్ స్పందిస్తూ... ఈ సమస్యపై మరింత చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అయితే పెప్సీ అధ్యక్షుడిగా కమల్‌హాసన్‌ వున్నప్పుడు ఇటువంటి సమస్య వచ్చింది. దీనిపైకూడా ఆయన హైదరాబాద్‌ వచ్చినప్పుడు మాట్లాడుతూ.. సమస్యలున్నాయి.. వాటిని కూలంకషగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

షూటింగ్‌లు జరగవు

ఈ నేపథ్యంలో కార్మికుల జీతభత్యాలు ఒక కొలిక్కివచ్చేవరకు తెలుగు సినిమాలు ప్రారంభోత్సవాలు ఈనెల 8 నుంచి జరగకూడదని నిర్ణయించారు. పాతవి ప్రారంభోత్సం అయినవి షూటింగ్‌లు చేసుకోవచ్చు. కానీ అవికూడా అక్టోబర్‌ 31లోగా పూర్తిచేసుకోవాలని రూల్‌పెట్టారు. దాన్ని అందరూ పాటించాలని కళ్యాణ్‌ 24 క్రాప్ట్‌లకు తెలియజేశారు.

నిర్మాతకు స్వతంత్రం ఉండాలి

కార్మికులు ఇలా గొడవ చేస్తుంటే.... నిర్మాతలు మాత్రం తమకు ఏ కార్మికుడ్ని పనిలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే అవి అమలువుతన్నా.. పూర్తిగా అమలుకావడంలేదు. జూనియర్‌ ఆర్టిస్టులు, క్యారెక్టర్‌ఆర్టిస్టులు, ఆర్ట్‌, ఫొటోగ్రఫీ, ఫైట్స్‌, మేకప్‌ వంటి కొన్ని శాఖలు మాత్రం యూనియన్‌ మేరకు పనులు కల్పిస్తుంటారు.

కనుక నిర్మాత అనేవాడు పనివచ్చినవాడినే పెట్టుకుంటామని, పనిరాని వారినియూనియన్లు పర్మిషన్‌ ఇచ్చినా తమకు నష్టం జరుగుతుందని చర్చ లేవదీశారు.

ఫైటర్లు చెన్నై వెళ్ళిపోయాలి

ఇదిలా ఉండగా, చెన్నైలో ఫైటర్ల అసోసియేషన్‌లో సభ్యత్వం ూన్న రామ్‌లక్ష్మణ్‌లు, విజయన్‌ మాస్టర్లు తెలుగులో సినిమాలు చేశాక, వెంటనేతిరిగి చెన్నై వెళ్ళిపోయాలని ఆంధ్ర ఫైటర్లు అసోసియేషన్‌ ఇటీవలే ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు లేఖలురాసింది. మరోలేఖను పెప్సీకి కూడా అందించింది. వీరు సినిమాలుపూర్తయినా ఇక్కడే ఉండడంవల్ల ఆంధ్రవారికి పని కల్పించకపోవగా చెన్నైనుంచి ఫైటర్లను దిగుమతి చేస్తున్నారని... దాని వల్ల సభ్యత్వం కట్టి,, పనికోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పండుతుందని ఆంధ్రఫ్రైటర్లు అధ్యక్షుడు రాజేశ్వర్‌ అంటున్నారు.

త్వరలో నిర్ణయం తీసుకుంటాం: ఛాంబర్‌

ఇటీవలే ఛాంబర్‌ కొత్తకార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడుడిగా బూరగుపల్లి శివరామకృష్ణ ఎన్నికయ్యారు. మిగిలిన శాఖలకు మరికొంతమంది ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలు కూడా బడా నిర్మాతల ఆశీస్సులమేరకే ఎన్నికైందనే విమర్శ ఉంది. పేరుకు మిగిలిన శాఖాధ్యక్షులున్నా... పనంతా బడా నిర్మాతలనే చేస్తున్నారు.

ఇటీవలే నట్టికుమార్‌ విరుచుకుపడింది కూడా అదే. ఫైటర్ల సమస్య, కార్మికుల జీతభత్యాలు, హీరోల పారితోషికాలు కూడా బడా నిర్మాతలు నిర్ణయించినమేరకే ఇస్తారని ఇందులో మరో మాటకుఅవకాశం లేదని తెలిసింది.

ఛాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశంలో డబ్బింగ్‌ సినిమాలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తీసుకుంటామని మీటింగ్‌లో చెప్పినా.. అది అమలు కావడంలేదని గోపాల్‌ అనేనిర్మాత వాపోయాడు. వీరి నిర్ణయాలవల్ల చిన్న చిత్రాలు తీయాలంటే భయమేస్తుంది. డబ్బింగ్‌ సినిమాలు థియేటర్లకుమింగేస్తున్నాయని వాపోయాడు.

ఈ విషయమై ఛాంబర్‌ అధ్యక్షడిని సంప్రదిస్తే... త్వరలోనిర్ణయం తీసుకుంటామనీ, కొత్తగా ఎన్నికయ్యాక సమస్యలు పరిశీలిస్తున్నామని సమాధానమిచ్చాడు.

వెబ్దునియా పై చదవండి