ఛార్మీ మంత్ర పాటలు వచ్చే నెలలో విడుదల

మంగళవారం, 24 జులై 2007 (12:29 IST)
జెనరేషన్ నెక్ట్స్ మూవీస్ పతాకంపై తులసీరామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'మంత్ర' చిత్రం ఒక పాట మినహా మొత్తం పూర్తయింది. మిగిలిన పాట చిత్రీకరణను ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని దర్శకుడు తులసీ రామ్ చెప్పారు. ఇప్పటికే.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను కూడా జరుపుకుంటున్న మంత్ర ఆడియోను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు.

ఒక ఆధునిక యువతి అనుకోని పరిస్థితులలో సమస్యల వలయంలో చిక్కుకొని వాటిని ఎదుర్కొన్న అంశాలే కథనంగా సినిమా సాగుతుందని వారు చెబుతున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందాల చార్మీ ధీమా వ్యక్తం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి