టాలీవుడ్‌పై మరోసారి దండెత్తిన రామ్‌గోపాల్ వర్మ

WD
రామ్‌గోపాల్ వర్మ ఇక నుంచి "దెయ్యం", "భూతం" వంటి చిత్రాల నుంచి ఆర్‌జీవి బ్యానర్‌లో తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు. అవి సమకాలీన సమస్యలపై చేయనున్నారు. ఒక రకంగా ఆయన పని రాక్షసుడని ఆయనతో కాసేపు చర్చల్లో పాల్గొంటే బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చని పూరీ జగన్నాథ్ కూడా ఇటీవలే సర్టిఫై ఇచ్చారు.

ఐదు రోజుల క్రితం పూరీ జగన్నాథ్‌తో రామ్‌గోపాల్ వర్మ హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనతో కథా చర్చలు ముగిసేటప్పటికి తెల్లవారు జాము 3 గంటలయిందిని పూరీ చెప్పారు. తను నిద్రపోయేది తక్కువేనని వర్మ గురించి పూరీ కితాబిచ్చారు.

జగపతి బాబు హీరోగా "అనుమానపు పెళ్లాం"
ఇదిలావుండగా వర్మ ప్రస్తుతం మూడు తెలుగు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగపతి బాబు కథానాయకుడుగా "అనుమానపు పెళ్లాం" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గాయం తర్వాత మళ్లీ జగపతిబాబుతో ఆయన చేస్తున్న చిత్రమిది. జగపతి బాబు బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. బహుశా ప్రియమణితో ఉన్న ఫ్రెండ్ షిప్‌తో ఆమెనే పెట్టినా ఆశ్చర్యం లేదని సమాచారం.
WD


పూరీ జగన్నాథ్‌తో "బిజినెస్ మాన్"
పూరీ జగన్నాథ్ చేయబోయే చిత్రానికి "బిజినెస్ మేన్" అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ చిత్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో రూపొందనుంది. అయితే ఇందులో లవ్‌ట్రాక్ కూడా ఉంటుందని పూరీ వెల్లడించారు. వీరిద్దరి కలయికతో ఒక సెన్సేషనల్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిసింది. ఇందులో హీరోహీరోయిన్లు ఇంక ఫైనల్ కాలేదు. అక్టోబర్ చివరిలో ఈ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.

WD
అల్లరి నరేశ్ "కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అప్పల్రాజు"
ఇది టైటిలే... కొత్తగా ఉంది కదూ... అవును. రామ్‌గోపాల్ వర్మ తీయబోయే సినిమాలే కాదు వాటి టైటిళ్లూ వెరైటీగా ఉంటాయి. "కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అప్పల్రాజు" అనే టైటిల్ ఇప్పటికే యూనిట్ సభ్యులకు నచ్చింది. దీన్ని ఫుల్ లెంగ్త్ వినోదభరితంగా మలిచే పనిలో రచయితలు నిమగ్నమై ఉన్నారు.

టైటిల్‌కు తగినట్లే ఈ చిత్రానికి హీరో అల్లరి నరేశ్‌ను ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ సమచారం. ఇందులోని పాటలను వెంకట్ అనే వ్యక్తి రాస్తున్నాడు. దర్శకుడిగా వంశీకృష్ణ ఆకెళ్ల చేస్తున్నారు. అయితే కథా వస్తువు... హీరో ఏ పని చేసినా అంటే అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలని వర్మ రచయితలకు చెప్పినట్లు సమాచారం. అందుకే దానికి "కథ - మాటలు - స్క్రీన్ ప్లే - అప్పల్రాజు" అనే పేరును పెట్టినట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి