టాలీవుడ్‌లో ట్రెండ్ మారిందా..? హీరోలు కూడా మారాల్సిందేనా?

FILE
కాలాన్ని బట్టి మనుషులు మారాలి. ఇది తెలిసిందే. సినిమారంగంలో హీరోలుకూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇద్దరు హీరోలు కలిస్తే నటిస్తే మంచిదికదా? అని అడిగితే.. ఆ ఆలోచన లేదనీ... కొందరంటే.. మరికొందరు సరైన కథ దొరకడంలేదని కబుర్లు చెప్పేవారు.. కానీ బాలీవుడ్‌లో ఆ ట్రెండ్‌ ఎప్పుడో ఉంది. తెలుగులో సోలోగా ఇరకదీయాలని చూస్తుండేవారు. కానీ కాలం ఒకలా ఉండదు. ఎంత పెద్ద హీరో చిత్రాలైనా ఆడాలంటే గగనంగా మారిపోయింది. దాంతో మరో హీరోతో కలిసి నటించే తరుణం ఆసన్నమైంది.

ముఖ్యంగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందే పాత్రలే చేస్తామని హీరోలు చెబుతున్నారు. మరి అలాంటివి కాకుండా పిచ్చి పాత్రలు ఇవ్వరుగదా... కాగా, ఇద్దరు హీరోలుంటే.. సినిమాలకు ప్లస్‌ అవుతుందనీ, ఇద్దరినీ చూసేందుకు ప్రేక్షకులు బాగానే వస్తారని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

ఆల్‌రెడీ రామ్‌చరణ్‌ 'ఎవడు'లో అల్లు అర్జున్‌ నటించేశారు. ప్రత్యేకపాత్ర పేరుకే కానీ.. సెకండాఫ్‌లో ఎక్కువసేపు ఉంటాడని తెలిసింది. ఇప్పటికే వెంకటేష్‌-మహేష్‌భాబు నటించేశారు. మళ్ళీ రామ్‌తో వెంకీ నటించాడు. రాబోయే చిత్రాల్లో నటిస్తున్నాడు. బాద్‌షాలో ఎన్‌.టిఆర్‌తోపాటు.. సిద్దార్థ్ కూడా మెరుస్తాడు.

మంచు మనోజ్‌ చేసిన 'ఊకొడతారా..'లో బాలకృష్ణ నటించాడు. ఇక తమిళరంగంలో ఇద్దరు హీరోలుకూడా నటిస్తున్నారు. తాజాగా తమిళంలో విజయం సాధించిన 'ఆరంభం'లో అజిత్‌ హీరో. ఆయనతోపాటు దగ్గుబాటి రానా కూడా ఉన్నాడు. ఇందులో యాంటీ స్కాడ్‌ ఆఫీసర్‌గా ఆయన నటించాడు. తమిళంలో రిసీవ్‌ చేసుకున్నారు.

తెలుగులో ఈ చిత్రం ఈనెల 28న విడుదలకాబోతుంది. ఇవికాకుండా.. పూరీ సోదరుడు సాయిరాంశంకర్‌ హీరోగా నటిస్తున్న 'రోమియో'లో తళుక్కుమని... రవితేజ కన్పించనున్నారు. 'నేనింతే' రవితేజ చిత్రంలో... సాయి హీరో ఫ్యాన్‌గా నటించాడు. ఇప్పుడు రివర్స్‌ అయింది.

సాయి హీరోగా నటిస్తుండగా రవితేజ.. ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. ఇదంతా వారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యమే కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా కాలంతోపాటు హీరోలుకూడా మారాల్సిందేనని రుజువుచేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి