దర్శకత్వం వహిస్తా : ధనుష్

WD
ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడైన "ధనుష్"... సన్నని శరీరంతో తమిళ తెరకు పరిచయమైనప్పుడు, హీరోగా ఇతనికి గుర్తింపు లభిస్తుందానని అందరూ ఏకరువు పెట్టారు. అయితే హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా, తిరుడా... తిరుడి... (తెలుగులో దొంగా.. దొంగది), యారడీ నీ మోహిని! (తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే) వంటి తదితర సినిమాలు ఆయనకు గుర్తింపును సాధించి పెట్టాయి.

ఇలా హీరోగా ముద్ర వేసుకున్న ధనుష్ దర్శకత్వ పగ్గాలు చేపడుతానంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే... హీరోకు ఉండాల్సిన లక్షణాలు తనలో లేకున్నా... ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నారని చెబుతున్నారు. ఇదే పర్సనాలిటీతో తెరపై ఎక్కువకాలం నిలబడకపోవచ్చునని, అలాగే మెప్పించలేకపోవచ్చునని, అందుచేత ఇంకా ఎక్కువ కష్టపడి పాత్రల్లో ఒదిగిపోవాల్సి ఉందని అన్నారు. దీనికోసం శాయశక్తులా శ్రమిస్తున్నానని, ఇలాగైతేనే భవిష్యత్తులో నిలదొక్కుకోగలనని వెల్లడించారు.

ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి వేరొక మార్గాన్ని త్వరలో ఎంచుకోనున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడైన ధనుష్ వెల్లడించారు. అదేమిటో తెలుసా? ఆయన చిరకాల కోరికైన దర్శకత్వ బాధ్యతలను చేపట్టడమే. 2010 వరకు డేట్స్ ఖాళీగా లేవని, అంగీకరించిన చిత్రాలు పూర్తికాగానే 2010లో డైరక్టర్ అవుతానని ధనుష్ అంటున్నారు. ఇంకేముంది... ధనుష్ తండ్రికి తగ్గా కొడుకనిపించుకుంటాడేమోనని.. వేచి చూడాల్సిందే. మరీ...!

వెబ్దునియా పై చదవండి