పవన్ కల్యాణ్‌కి అక్కడ ఓటు హక్కు ఉంది!

సోమవారం, 9 డిశెంబరు 2013 (13:30 IST)
FILE
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పేరు ఇప్పుడు మారింది. పవన్ అసలు పేరు 'దేవి లచ్చయ్య' గా మార్చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ మండలం నస్పూర్ పంచాయతీ ఓటరు జాబితాలో 'పవర్ స్టార్' ఫోటో దర్శనమిచ్చింది. పంచాయతీ పరిధిలోని నస్పూర్ కాలనీలో దేవి లచ్చయ్య ఓటరుగా ఉన్నాడు.

ఆ జాబితాలో ఆయన ఫోటో ఉండాల్సిన స్థానంలో పవన్ ఫోటో ఉంది. మిగతా వివరాలన్నీ లచ్చయ్యవే. నస్పూర్ కార్యాలయంలో సిబ్బంది జాబితా పరిశీలిస్తుండగా ఈ విడ్డూరం వెలుగులోకి వచ్చింది. ఇటీవల మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను ధర్మవరం ఓటరుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి