పవన్ కల్యాణ్ x మహేష్ బాబు.. నెంబర్. 1 కుర్చీ ఎవరిది?

శుక్రవారం, 4 అక్టోబరు 2013 (16:17 IST)
FILE
ఒకరు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఇంకొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్ సినీమాలను ఏలుతున్నారు. వరుస హిట్లు కొట్టి బాక్సీఫీసు రికార్డులను తిరగరాస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ కుర్చీలో కూర్చునే అర్హత ఎవరికి వుంది? అని చర్చ గత మూడు సంవత్సరాలుగా జరుగుతూనే వుంది. ఎక్కువ హిట్స్‌తో తన పేరును నమోదు చేసుకున్న మహేష్ బాబు ముందువరుసలో ఉంటే, ఆ తరువాత పవన్ కల్యాణ్ కూడా తానేం తక్కువ కాదంటూ వరుస హిట్స్ ఇచ్చి సవాల్ విసురుతున్నాడు.

బాలీవుడ్ తరువాత మన దేశంలో అత్యధిక చిత్రాలను నిర్మిస్తున్న తెలుగు రంగం, తమిళ రంగాల్లో ఈ పోటీ నెలకొని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలను వసూలు చేసిన తొలి దక్షిణాది చిత్రంగా రజనీకాంత్ రోబో నిలుస్తోంది. అలాగే బాలీవుడ్‌లో 100 కోట్ల రూపాయల మార్కును దాటి కొన్ని సినిమాలు జెండాను ఎగురవేశారు.

దీంతో భారతీయ సినిమా కమర్షియల్ విలువలు మారిపోయాయి. తాజాగా బాలీవుడ్‌లో 300 కోట్ల మార్క్‌ను కూడా దాటేశాయి. రోబో తరువాత ఏ దక్షిణాది చిత్రం కూడా 300 కోట్ల మార్క్‌ను దాటలేదు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్ళు 80కోట్ల మార్క్‌ను దాటాయి. పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్, మహేష్‌బాబు దూకుడు 60 కోట్ల మార్క్‌ను దాటాయి. మరో రెండు మూడేళ్ళలో టాలీవుడ్‌లో కూడా వందకోట్ల మార్క్‌ను కూడా దాటుతుందని అంచనాలు ఉన్నాయి.

అయితే వంద కోట్ల మార్క్‌ను దాటే స్టామినా ఉన్న హీరోలు ఇద్దరే కనపడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు పైన చెప్పినట్లుగా మహేష్‌బాబు, మరొకరు పవన్ కల్యాణ్. నెంబర్ వన్ టాలీవుడ్ కిరీటం ఈ ఇద్దరిమధ్యే షటిల్ ఆడుతోంది. మిగతా హీరోలతో పోలిస్తే ఈ ఇద్దరికే అన్ని వర్గాలనుండి ఆదరణ, అన్ని వయసుల ప్రేక్షకుల గుర్తింపు ఉంది. అందుకే వంద కోట్ల మార్క్ దాటే హీరోలు ఈ ఇద్దరేనని సినీ పండితులు చెబుతున్నారు

వెబ్దునియా పై చదవండి