పవన్ 'కాటం రాయుడు' కాపీ అని ఒప్పుకున్న దేవిశ్రీ ప్రసాద్..!.

బుధవారం, 7 ఆగస్టు 2013 (16:41 IST)
FILE
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో ఓ ఫోక్ సాంగ్ పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అయితే ఈ పాటపై ఇప్పుడు కొంత వివాదం కూడా జరిగుతోంది. ఈ పాట 'సుమంగళి' అనే పాత సినిమాలో ఫోక్ సాంగ్ అని, భక్తి గీతం అని, ఎవరో ట్యూన్ చేసిన పాటను కాపీ కొట్టారని, దేవుడు పాటను ఖూని చేశారనే కథనాలు వచ్చాయి.

దీనిపై స్పందించిన దేవిశ్రీ ప్రసాద్ నిజాన్ని ఒప్పేసుకున్నాడు. అవును ఈ పాట ఓ పాత సినిమాలోనిదే. ఈ పాటను నేను ట్యూన్ చేయలేదు. ప్రస్తుతం ఈ పాటకు వస్తున్న స్పందన అంతా కూడా అప్పుడు ఆ పాటను కంపోజ్ చేసిన వారికే దక్కుతుంది. అప్పుడు ఈ పాటను ఎవరు కంపోజ్ చేసారో తెలుసుకొని వారి పేరునే టైటిల్స్‌లో వేయాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి