ప్రియమణి 'చండీ'... ఎన్టీఆర్‌ని లాక్కొచ్చారు

శనివారం, 9 నవంబరు 2013 (11:05 IST)
FILE
ఎన్టీఆర్‌ అంటే... బుడ్డోడు కాదు.. పెద్దాయన అన్నగారు. ప్రియమణి కథానాయికగా నటించిన చిత్రం చండీ. సముద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గ్లామర్‌ డాల్‌ ప్రియమణి ఉన్నా.. సినిమాకి మాత్రం గ్లామర్‌ లేదు. సముద్ర సినిమా కదా.. అని జనం లైట్‌ తీసుకొంటారేమో అని, ఈ సినిమాలో ఎన్టీఆర్‌నీ లాక్కొచ్చారు.

చండీ ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్‌ అల్లూరి సీతారామరాజు గెటప్‌‌లో ఉన్న బొమ్మ వాడుకొంటున్నారు. అల్లూరి కథకూ ఈ సినిమాకూ సంబంధం ఉందట. అందుకే ఆ ఫొటో వాడుకొంటున్నాం అని సముద్ర చెబుతున్నారు.

అల్లూరి అంటే సూపర్‌‌స్టార్‌ కృష్ఱ కూడా ఉన్నారు కదా. అంటే మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు. మరి తారక రామారావు బొమ్మ వల్ల అయినా చండీకి కాసులు కురుస్తాయని ఆయన అభిప్రాయం కాబోలు.

వెబ్దునియా పై చదవండి