"ప్రేమికుల రోజు" హీరో కునాల్ ఆత్మహత్య

గురువారం, 7 ఫిబ్రవరి 2008 (16:35 IST)
FileFILE
'ప్రేమికుల రోజు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో కునాల్ గురువారం ఉదయం ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు వయస్సు 27 సంవత్సరాలు. తమిళంలో 'కాదలర్ దినం' (ప్రేమికుల రోజు), 'పున్నగై దేశం', 'వరుషమెల్లాం వసంతం', 'అర్బుదం' వంటి చిత్రాల్లో నటించాడు. తొలి చిత్రం 'ప్రేమికుల రోజు' కునాల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

సూర్యా మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మాతగా కదిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా సోనాలీ బింద్రే నటించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చగా ఈ పాటలు సూపర్ డూపర్ హిట్‌ అయిన విషయం తెల్సిందే. అలాగే హిందీలో 'దిల్‌ హై దిల్ మైన్' అనే చిత్రంతో బాలీవుడ్ వెండితెర అరంగేట్రం చేశారు.

అయితే.. కునాల్ గురువారం ఉదయం ఇంటి పడక గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కునాల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. దీనిపై అంథేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రేమికుల రోజుకు మరో వారం రోజుల సమయం ఉండగా.. ఆ చిత్రం హీరో కునాల్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి